Monday, June 26, 2017

శ్రీ వాల్మీకి ఆవాసం ( సేవాభారతి – జగిత్యాల ) లో ప్రవేశాలకు ఆహ్వానం

శ్రీ వాల్మీకి ఆవాసం ( సేవాభారతి – జగిత్యాల ) లో 2017-18 సం.నకు విద్యార్థుల ప్రవేశాలకు ఆహ్వానం
పూర్వ కరీంనగర్ మరియు ఆదిలాబాద్ జిల్లాల్లోని గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలో పుట్టి చదువు పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థుల కొరకు “శ్రీ వాల్మీకి ఆవాసం జగిత్యాల” లో ఇంగ్లీష్ మీడియం లో మాత్రమే ప్రస్తుతం 2వ తరగతిలో -4, 3 వ తరగతిలో – 4, 4వ తరగతిలో -1, మరియు 5వ తరగతిలో- 3 మరియు 6వ తరగతి లో -3 ఖాళీలు ఉన్నవి . ఇందులో అడ్మిషన్ పొందినచో వారిని ఇంగ్లీష్ మీడియం లో స్థానిక గీతా విద్యాలయం లో చేర్చబడుదురు . వీరికి 10వ తరగతి వరకు ఉచిత విద్యాబోధనతో పాటు వసతి సౌకర్యం కల్పించబడును . అడ్మిషన్స్ కొరకు వచ్చిన అన్ని దరఖాస్తులను ఆవాస కమిటి పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది .

ఈ సామాజిక సేవలో ఉపాధ్యాయులు , ఉద్యోగులు ,విద్యావంతులు , స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు స్వచ్చంద సేవాకార్యకర్తలు మీ వంతుగా పై అర్హత గల విద్యార్థుల కుటుంబాలకు మన ఆవాసం ను పరిచయం చేసి వారికి చేయూతనివ్వ వలసినదిగా మనవి .

దరఖాస్తులకు చివరి తేది : 10-6-2017

పూర్తి వివరాలకు : 
శ్రీ వాల్మికి ఆవాసం - ధరూర్ క్యాంపు , 
రామాలయం వెనుక హౌసింగ్ బోర్డు కాలని- జగిత్యాల కార్యాలయం 
: 93903 37341, 

ఆవాస ప్రముఖ్ ( వార్డెన్ ) : 99892 48893 ,  

ప్రధాన కార్యదర్శి : 94403 38949