Tuesday, May 2, 2017

An Inspiring tale of Philanthrophy in Jagithyala by a College student: Valmiki Avasam - Sevabharathi


దాతృత్వంకు మించి మరేమీ లేదు
దాతృత్వంకు మించి మరేమీ లేదు..వృత్తి వ్యవసాయమే అయినా…తన ఆడపిల్లలను చదివించుకుంటూనే….చదువుకునే పేద పిల్లలకు సాయం చేయడంను ప్రవృత్తిగా ఎంచుకున్నారు రాయికల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబం..
వివరాల్లోకి వెళితే…
అయోధ్య గ్రామానికి చెందిన మూఢపల్లి లచ్చన్న- గంగు దంపతులు గ్రామంలో తమకున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ, తమకున్న ముగ్గురు ఆడపిల్లలను చదివించుకుంటున్నారు. 
కష్టపడైనా సరే తమ పిల్లలను చదివించుకుంటూనే, కష్టపడి చదువుకునే పేద పిల్లలకు సాయం చేయాలన్న లక్ష్యం ఆ వ్యవసాయ కుటుంబాన్ని జగిత్యాల శ్రీ వాల్మీకి ఆవాసం వైపు నడిపించింది.
జగిత్యాల లోని ఒక ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న వారి కూతురు కళాశాల లోని ఓ ఉపాధ్యాయుడి ద్వారా శ్రీ వాల్మీకి ఆవాసం గురించి, అందులో క్రమశిక్షణ తో చదువుకుంటున్న పేద విద్యార్థుల గురించీ, ఆవాసంను అంకితభావంతో నిర్వహిస్తున్న నిర్వాహకుల గురించీ తెలుసుకుంది.
అలాగే, వారం క్రితం జరిగిన ఆవాసం రజతోత్సవాల కార్యక్రమం గురించి తెలుసుకుంది. ఆవాసం విషయాన్ని తమ కూతురు ద్వారా తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు లచ్చన్న- గంగు ఆవాసం విద్యార్థులకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.
వెంటనే
సామాజిక సమరసత జగిత్యాల జిల్లా కార్యదర్శి బెక్కం మల్లేశం ద్వారా, తమ పంట పొలంలో చమటోడ్చి పండించుకున్న పంట బియ్యం నుంచి రూ. 34 వేల విలువైన 8 క్వింటాళ్ల బియ్యంను స్వయంగా ఆదివారం శ్రీ వాల్మీకి ఆవాసంకు తీసుకువచ్చి నిర్వాహకులకు అందజేశారు…
ఈ సందర్భంగా నిర్వాహకులు సందెల్లి మదన్ మోహన్ రావు, గడ్డం తిర్మల్ రెడ్డి, గడ్డం మహిపాల్ రెడ్డి, అయిల్నేని నరేందర్ రావు, ఆకుతోట రమణారెడ్డి, ఎన్నమనేని అశోక్ రావు, కనికరపు లచ్చన్న, సేవాభారతి శేఖర్, ఆవసం ప్రముఖ్ మల్లేష్ లు దాతృత్వం-మానవత్వం కల్గిన వ్యవసాయ కుటుంబంకు చెందిన దాతలు లచ్చన్న- గంగు తో పాటు డిగ్రీ విద్యార్థినికి , వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.
Source: http://www.telanganareporter.news/దాతృత్వంకు-మించి-మరేమీ-ల/

No comments:

Post a Comment