Thursday, April 20, 2017

శ్రీ వాల్మీకి ఆవాసము- సేవాభారతి రజతోత్సవం


శ్రీ వాల్మీకి ఆవాసము- సేవాభారతి రజతోత్సవం కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక గీతావిద్యాలయం మైదానంలో జరిగింది
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, కేంద్ర ఒప్పంద కార్మికుల సలహామండలి చైర్మెన్ సురభి భూమ్ రావు, ఆర్ఎస్ ఎస్ గౌడ జనార్దన్,  మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, తెలంగాణ ప్రాంత ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ పెడబల్లి దేవేంద్రజీ, ఆవాస కమిటీ అధ్యక్షుడు డా.ఎడ్మల శైలేందర్ రెడ్డి పాల్గొనగా, సభాధ్యక్షుడుగా ఆర్ ఎస్ ఎస్ జిల్లా సంఘ్ చాలక్ డా.భీమనాతిని శంకర్ వ్యవహరించారు..
ఇంకా ఈ కార్యక్రమంలో , ఉపాధ్యక్షుడు బోగ వెంకటేశ్వర్లు, కార్యదర్శి సందెల్లి మదన్ మోహన్ రావు, సహ కార్యదర్శి కాసిడి లక్ష్మరెడ్డి, కోశాధికారి తుమ్మనపల్లి సత్యనారాయణ తో పాటు సభ్యులు జిడిగె పురుషోత్తం, డా.గుండేటి ధనుంజయ, సుంకేటి లింబారెడ్డి, ఎన్నమనేని అశోక్ రావు, టివి సూర్యం, ఆవారి అంజన్ బాబు, బెజ్జంకి సంపూర్ణ చారి, కన్నవేని మల్లారెడ్డి, దువ్వాసి చంద్రమౌళి, వీరమల్ల మారుతిరావు, పుప్పాల సుఖేందర్ తదితరులు పాల్గొన్నారు.బిజెపి  జిల్లా అధ్యక్షుడు బాజోజి భాస్కర్, నాయకులు ముదుగంటి రవీందరెడ్డి, వూట్కూరి అశోక్ రెడ్డి, పూదరి అరుణ, ఎసిఎస్ రాజుు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆవాసం విద్యార్థులు ప్రదర్శించిన పలు వ్యాయామ విన్యాసాలు విశేషంగా అలరించాయి…
శ్రీ వాల్మీకి ఆవాసము- సేవాభారతి గురించి సేవాభారతి తెలంగాణ ప్రాంత ఉపాధ్యక్షుడు నాగు వివరిస్తూ….
సేవాభారతి సేవా సంస్థ ద్వారా సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా, సంస్కృతి పరంగా వెనుకబడిన మనతోటి బంథువుల సముధ్దరణ కోసం దేశవ్యాప్తంగా బాల సంస్కార కేంద్రాలు, ఉచిత బోధనా తరగతులు, ఏకోపాధ్యాయ పాఠశాలలు, బాల కార్మిక పాఠశాలలు, వైద్యకేంద్రాలు, ఆవాసాలు లాంటి ఒక లక్ష యాభై వేలకు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని వివరించారు.తెలంగాణ ప్రాంతంలో సేవా బస్తీ, గిరిజన, చెంచు, నిరాశ్రిత బాలల కోసం 15 ఆవాసములను సేవాభారతి నిర్వహిస్తుందని వెల్లడించారు. ఇందులో భాగంగానే జగిత్యాల శ్రీ వాల్మీకి ఆవాసము పేరిట గ్రామీణ నిరుపేద బస్తీ విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజన, వైద్య సదుపాయాలు కల్పించి, వారిలో సర్వాంగీణ వికాసం తీసుకురావడంతో పాటుగా , వారిని సంస్కారవంతులైన దేశభక్త పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం ప్రారంభమై, 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో నిర్వహిస్తున్న రజతోత్సవ సమావేశం సమాజంనుండి మరింత ప్రోత్సాహం అందగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ….నిరుపేద బస్తీ పిల్లలకు విద్యాబుధ్దులు నేర్పుతూ, క్రమశిక్షణతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దుతున్న సేవాభారతి కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం తలపెడుతున్న కార్యక్రమాలకు సేవాభారతిలాంటి సంస్థలు సహకార మందిస్తూ…గ్రామీణ, బస్తీ నిరుపేద విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, సంస్కారవంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలన్నారు.

No comments:

Post a Comment