Friday, March 25, 2016

వాల్మీకి ఆవాస విద్యార్థులు గీసిన చిత్రాలు

మన వాల్మీకి ఆవాస విద్యార్థులు గీసిన చిత్రాలు

Drawing Skill of Valmiki Avasam Children




Tuesday, March 22, 2016

అన్ని దానాల్లో విద్యాదానం గొప్పది

Imparting education is the Noblest of the things : Vedic pandit Nambi Venugopalacharya
జగిత్యాల :అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదని జగిత్యాల పట్టణానికి చెందిన వేద పండితులు నంబి వేణుగోపాలచార్య కౌశిక అన్నారు. సోమవారం స్నేహ జగతి వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో వేణుగోపాలచారి మనువడు వాసుదేవ ఆర్థిక సహాయంతో నోట్‌బుక్స్‌, పెన్నులను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్‌ సర్వత్రా పూజ్యతే అన్నట్టు విద్యావంతులు ఎల్లవేళలా గౌరవించబడుతారని చెప్పారు. విద్యార్థుల చదువు కోసం సహాయం చేయడం మహోన్నతమైనదని అన్నారు. జగిత్యాల పట్టణం ధరూర్‌ క్యాంపులోని వాల్మీకి ఆవాసంలో 37 మంది, భగిని నివేదిత ఆవాసంలో 27 మంది, విద్యానగర్‌లోని ఆనంద నిలయంలోని 32 మంది, బాల సదన్‌లోని 35 మంది విద్యార్థులకు నోట్‌బుక్కులు, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్నేహజగతి వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు కొక్కుల ప్రభాకర్‌, ఉపాధ్యక్షుడు కల్యాణం శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి మొబీన్‌, కోశాధికారి మనోజ్‌కుమార్‌, న్యాయ సలహాదారుడు హరిఅశోక్‌కుమార్‌, గాజుల రాజేందర్‌ పాల్గొన్నారు.
Source: http://www.navatelangana.com/article/karimnagar/255145