Monday, September 28, 2015

A donor Smt Vasavi appeals for Valmiki Avasam


నిన్నటి మా బాబు పుట్టిన రోజు సందర్భంగా లైకులు, కామెంట్లతో శుభాకాంక్షలు అందచేసిన ప్రతీ ఒక్కరికీ నా తరవున, నా పుత్ర రత్నం (నిజంగా రత్నమే ) తరపున నా హృదయ పూర్వక కృతజ్ఞతలతో కూడిన నమస్సుమాంజలులు.. 

బాబుని బర్త్ డే కి కేక్ కట్ చేయమంటే వద్దన్నాడు.
ఫ్రెండ్స్ కి పార్టీ అంటే వద్దన్నాడు..
కొత్త డ్రెస్ కూడా చాలా ఫోర్స్ తో కొనుక్కున్నాడు.
అమ్మా ఆ డబ్బులతో ఎవరైనా లేని వారికి ఖర్చు పెడదాం అని తన ఆలోచనని చాలా సున్నితంగా, సాధారణంగా చెప్పాడు. సరే ఆ కేక్ కూడా అక్కడే కట్ చేసుకో అంటే వారందరూ పుట్టిన రోజులు జరుపుకోలేని వాళ్ళు. వారంతా హర్ట్ అవుతారు కేక్ వద్దు అని చెప్పి " వాల్మీకి ఆవాసం" జగిత్యాల ధరూర్ క్యాంపులో ఉన్నటువంటి ఆవాసానికి తీసుకెళ్ళాడు. ఆ నిర్వాహకులతో ముందే మాట్లాడి వచ్చాడట. చాలా చాలా ఆనందం వేసింది. ఈ రోజుల్లో బర్త్ డే ని ఏ రెస్టారెంట్ లో జరుపుకుందామా..? తిందామా తాగుదామా.? ఎంజాయ్ చేద్దామా..? అనే నేటి యువత ముందు నా బాబు చాలా గొప్పగా, ప్రత్యేకంగా కనిపించాడు. వాడి ఆలోచనలకి హృదయంలోనే పెద్ద నమస్కారం పెట్టా. 

ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఆ ఆవాసంలోని పిల్లలందరూ వెళ్లగానే స్వాగతం తెలపడం, నమస్కారం తో పలకరించడం, అక్కడ ఉన్న సరస్వతి మాతకి దీప ప్రజ్వలన బాబుతో చేయించడం, బాబుని "శతమానం భవతి శతాయుష్షూ" అంటూ శ్లోకంతో దీవించటం , తర్వాత వరసలో ఒక క్రమ పద్ధతిలో కూర్చున్న తర్వాత బాబు నేను వడ్డించటం, భోజనం చేయటం చాలా సంతోషంగా నా మనసు ఆత్మానందం పొందినది. భోజన సమయంలో పిల్లలు ఎంత నిశ్శబ్దంగా ఉన్నారో చెప్పలేను. వారి క్రమ శిక్షణకు మురిసి పోయా.. ఇంతటి ఆనందాన్ని సంతోషాన్ని నాకు కలిగించిన వాల్మీకి ఆవాసం నిర్వాహకులకు, నా పుత్ర రత్నంకీ ఎల్లప్పుడూ మంచే జరగాలని కోరుతూ , ఆ భగవంతుడు చల్లగా ఆయురారోగ్యాలతో ఏ కష్టాలు లేకుండా చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా... 

(ఒకరోజు భోజనం ఖర్చు రూ.. 2000/- మాత్రమే.. )
మీరు కూడా ఎవరైనా ఇవ్వాలనుకుంటే శ్రీ వాల్మీకి ఆవాసం సేవా భారతి ని సంప్రదించగలరు.
శుభోదయం మిత్రులందరికీ అనే కంటే ఆప్తులందరికీ అంటే బాగుంటుందేమో... 

మీ..
వాసవి..
విజయ లక్ష్మి మార.

Source: https://www.facebook.com/Vijayaw.Laxmi.Mara

Thursday, September 17, 2015

మట్టి వినాయకుడినే పూజించడం ఎందుకు?


 ఈ ప్రశ్న గణపతికి సంబంధించిన పురాణ కధల్లో కనిపిస్తుంది. మట్టిగణపతిని పూజించడానికి పురాణప్రాశస్త్యం కూడా ఉంది. ఏదో వినాయకచవితి వల్లనే మొత్తం కాలుష్యం జరుగుతున్నట్టు మీడియా మరియు కొన్ని సంస్థలు నానా హంగామా చేస్తున్నాయి. అసలు దాని గురించి పురాణం ఏమంటోందో చూద్దాం.
గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. "ఓ మహర్షి! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?"
"మునీంద్రులారా! మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత(అంతటా ఉన్నది పరమాత్ముడే) తత్వము కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని(అంతటా, అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు. విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించే పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు(లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). మృత్తికయే పరబ్రహ్మ కనుక, మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది. అంతేకాదు మట్టి ఎక్కడైనా, ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా, ధనిక అనే తారతమ్యం లేదు. సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భుమి/మట్టి/వసుధ. బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు. నేడు సమస్తమానవాళి ఆచరిస్తోంది. సర్వజీవ సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం, పూజ" అని చెప్పాడు సూతుడు.
- మహాగణపతి పురాణం(బ్రహ్మశ్రీ తాడంకి వెంకట లక్ష్మీనరసింహరావు)
మట్టి గణపతులనే ఆరాధించడమే మన సంప్రదాయం. మట్టి గణపతులనే పూజించండి.
ఓం గం గణపతయే నమః

Valmiki Avasam Sharing and Caring : Everybody Our Partners

Valmiki Avasam Sharing and Caring : Everybody Our Partners