Wednesday, October 30, 2013

Wishing a Great Day

ఆవాస దాతలకు,ఆత్మీయులకు శుభోదయం.

Tuesday, October 29, 2013

Donation for the day: Valmiki awasam

(నేటి మన దాత)
చి:నితీష్ కి జన్మదిన శుభాకాంక్షలు.
అర్చన-అనిల్ రావు గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు.
మీ
శ్రీ వాల్మీకి ఆవాసం -సేవాభారతి

A Little girl Celebrate Birthday at Valmiki Avasam


మల్లారెడ్డి గారి కూతురు సంజనారెడ్డి (రాయికల్) పుట్టినరోజు 26th Oct


Monday, October 28, 2013

Practicing for the Annual Day celebrations: Valmiki Avasam

వార్షికోత్సవం కొరకు యోగాసనాలు అబ్యాసం(వాల్మీకి ఆవాసం -ధరూర్ క్యాంపు,జగిత్యాల)

Thursday, October 24, 2013

Comemorating The Police Martyrs day: Valmiki awasam Visited by the Officers

Comemorating The Police Martyrs day  C.I. Kiran Kumar and S.I. Lakshminarayana visited the Valmiki awasam & Bhagini Nivedita Awasa,m for Girls to distribute fruits and share their time with the kids.

CI కిరణ్ కుమార్ గారు,SI లక్ష్మి నారాయణ గారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున భగిని నివేదిత ఆవాసం (బాలికల ఆవాసం), వాల్మీకి ఆవాసం (బాలుర ఆవాసం) విద్యార్థులకు పండ్లు పంపిణి చేశారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా CI కిరణ్ కుమార్ గారు,SI లక్ష్మి నారాయణ గారు వాల్మీకి ఆవాసం,భగిని నివేదిత ఆవాస విద్యార్థులకు పండ్లు పంపిణి చేశారు.ఈ సందర్బంగా ఒక విద్యార్థికి అయ్యే సంవత్సరం ఖర్చు 15000/- CI కిరణ్ కుమార్ గారు ఇస్తానని చెప్పారు.అదేవిధంగా భగిని నివేదిత బాలికల ఆవాసంలో ఒక విద్యార్థినికి అయ్యే ఖర్చు ఇస్తానని SI లక్ష్మి నారాయణ గారు చెప్పారు. వీరికి శ్రీ వాల్మీకి ఆవాసం తరుపున మరియు భగిని నివేదిత ఆవాసం తరుపున కృతజ్ఞతలు.


 

Monday, October 21, 2013

నేటి మన దాత... Donor of the day

నేటి మన దాత... Donor of the day

Gandhi Jayanthi Celebration at Valmiki awasam

 విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న పోరంపల్లి (H.M) వెంకట సుబ్బలక్ష్మిగారు.మీరు శ్రద్ధగా చదువుకొని ఆవాసానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పారు గురువులను,తల్లిదండ్రులను గౌరవించాలని,చెప్పారు.



విద్యార్థులకు దుస్తువులు పంపిణి చేస్తున్న దృశ్యం 



జగిత్యాలలోని విద్యానగర్ కు చెందిన బండారు వెంకట సుబ్బలక్ష్మి(తిమ్మాపూర్ మండలం పోరంపల్లి HM)-ప్రభాకర్ గారు గాంధీ జయంతి సందర్భంగా ఆవాసం వచ్చారు. ఈ సందర్భంగా ఆవాస విద్యార్థులకు దుస్తులు,పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమములో KV సురేందర్ గారు(టీచర్), ఆవాస కార్యదర్శి నందెల్లి మదన్ మోహన్ గారు,సహా కార్యదర్శి కాసిడి లక్ష్మారెడ్డి గారు, ఆవాస ప్రముఖ్ సుద్దాల మల్లేశం గారు తదితరులు పాల్గొన్నారు.

Thursday, October 3, 2013

A donation from Dubai to Valmiki Awasam

దుబాయ్ నుండి 15000 రూలు ఆవాసానికి విరాళంగా అందించిన ఇంద్రసేనారెడ్డి గారు. దుబాయ్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఇంద్రసేనారెడ్డి గారు,వారియొక్క స్నేహితుడు ఒర్రె గంగాధర్ గారి ద్వారా వాల్మీకి ఆవాసం గురించి తెలుసుకొని, వారుకూడా తమవంతు సహకారం అందించాలనే సహుద్దేశంతో దుబాయ్ నుండి బారతదేశానికి వస్తున్న శ్రీధర్ గారితో ఇంద్రసేనారెడ్డి,గంగాధర్ గారు ఆవాసానికి 15000రూలు విరాళంగా పంపించారు. వీరికి శ్రీ వాల్మీకి ఆవాసము తరుపున ధన్యవాదములు.
ఆవాస అబివృద్దికి సహకరించే వారందరికీ మా స్వాగతం.

Wednesday, October 2, 2013

JNTU College shares their Ganesh festivities with Valmiki Awasam Children

 ఆవాస విద్యార్థులతో కలిసి బజన కార్యక్రమంలో పాల్గొన్న JNTU కళాశాల ప్రిన్సిపాల్ తిరుమల చారి గారు.

విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న JNTU కళాశాల ప్రిన్సిపాల్ DR.M.తిరుమల చారి గారు.
విద్యార్థులు కష్టపడి చదివి వాల్మీకి ఆవాసానికి మంచిపేరు తీసుకురావాలని వారు కోరుకున్నారు, ఆవాసానికి తమవంతు సహకారం అందిస్తామని వారు చెప్పారు