Saturday, September 28, 2013

A Brief Appeal of the Home

శ్రీ వాల్మీకి ఆవాసము.జగిత్యాల పట్టణము ధరూర్ క్యాంప్ లోని గత రెండు దశాబ్దాలుగా శ్రీ వాల్మీకి ఆవాసం నిర్వహించడం జరుగుతుంది.ఇందులో గ్రామీణ నిరుపేద, నిరక్షరాస్యత కుటుంబములో పుట్టి చదువుకోలేని ఉత్సాహ వంతులైన విద్యార్థుల, బాలురకు క్రమశిక్షణాయుతమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో సేవా కొరకు ఆవాసం నడుపుచున్నామని తెలియపరుచుటకు సంతోషిస్తున్నాము.వారికి ప్రాధమిక పరిజ్ఞానము,బోజనము, వైద్యము సదుపాయము కల్పిస్తూ వారి యొక్క శారీరక,మానసిక వికాసానికి కృషిచేస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాము. మా విద్యార్థులు చదువులోనే కాకుండా ఆట,పాటల యందు జిల్లా, రాష్ట్ర,జాతీయ స్థాయిలలో ఎంతో ప్రతిభ కనభరిచిఆవాసానికి గుర్తింపు తెచ్చినందుకు ఆనందిస్తున్నాము/ నేటి బాలురే రేపటి పౌరులు అన్నట్లు, వీరే మన దేశ భవిష్యత్తు కనుక, వీరికి అన్ని వేళలా మీ సహకారాన్నిఅందించాలని బగవంతున్ని ప్రార్ధిస్తున్నాము.
ఈ ఆవాస నిర్వహణకు గాను మేము మీ యొక్క సహాయ, సహకారములు కావాలని కోరుచున్నాము. ఇందులో భాగంగా మీ ఇంట జరుగు పుట్టినరోజు,పెళ్లిరోజు, గృహ ప్రవేశము మరియు ఇతర శుభ కార్యములు సమకుర్చినచో మీ పేరున భోజన వసతి నిర్వహణ ఖర్చు 2000/- రూపాయలు సమకూర్చినచో మీ పేరున భోజన వసతి కల్పించబడును. మీరు చేయు సహాయము ఇంకా వతురూపేణ కూడా అందించవచు.
మీ పెద్దల జ్ఞాపకార్ధంగా కూడా ఆ రోజులలో భోజన సదుపాయం కల్పించవచ్చు.
ఈ విధంగా ఆవాసానికి ఒక మంచి పని చేయాలనే సహృదయముతో మీరు సహితం సహకరించే,సహకరిస్తున్న మీ దాతృత్వానికి స్వాగతిస్తున్నాం.

No comments:

Post a Comment