Sunday, September 29, 2013

Little Shiva Atmika shares her celebration her Birthday with Sri Valmiki Awasam

చిన్నారి "శివ ఆత్మిక" పుట్టిన రోజు సందర్బంగా రాజేందర్ - సుప్రియ గార్లు విద్యార్థులకు పండ్లు పంపిణి చేస్తున్న దృశ్యం.ఆవాసానికి మంచిపని చేయాలనే సహృదయంతో మీరు సహితం సహకరించినందుకు మీకు శ్రీ వాల్మీకి ఆవాసం తరుపున ధన్యవాదములు.
 Little Shiva Atmika celebrates her Birthday with Sri Valmiki Awasam: Thanks to Sri Rajender & Smt Supriya

Saturday, September 28, 2013

A Brief Appeal of the Home

శ్రీ వాల్మీకి ఆవాసము.జగిత్యాల పట్టణము ధరూర్ క్యాంప్ లోని గత రెండు దశాబ్దాలుగా శ్రీ వాల్మీకి ఆవాసం నిర్వహించడం జరుగుతుంది.ఇందులో గ్రామీణ నిరుపేద, నిరక్షరాస్యత కుటుంబములో పుట్టి చదువుకోలేని ఉత్సాహ వంతులైన విద్యార్థుల, బాలురకు క్రమశిక్షణాయుతమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో సేవా కొరకు ఆవాసం నడుపుచున్నామని తెలియపరుచుటకు సంతోషిస్తున్నాము.వారికి ప్రాధమిక పరిజ్ఞానము,బోజనము, వైద్యము సదుపాయము కల్పిస్తూ వారి యొక్క శారీరక,మానసిక వికాసానికి కృషిచేస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాము. మా విద్యార్థులు చదువులోనే కాకుండా ఆట,పాటల యందు జిల్లా, రాష్ట్ర,జాతీయ స్థాయిలలో ఎంతో ప్రతిభ కనభరిచిఆవాసానికి గుర్తింపు తెచ్చినందుకు ఆనందిస్తున్నాము/ నేటి బాలురే రేపటి పౌరులు అన్నట్లు, వీరే మన దేశ భవిష్యత్తు కనుక, వీరికి అన్ని వేళలా మీ సహకారాన్నిఅందించాలని బగవంతున్ని ప్రార్ధిస్తున్నాము.
ఈ ఆవాస నిర్వహణకు గాను మేము మీ యొక్క సహాయ, సహకారములు కావాలని కోరుచున్నాము. ఇందులో భాగంగా మీ ఇంట జరుగు పుట్టినరోజు,పెళ్లిరోజు, గృహ ప్రవేశము మరియు ఇతర శుభ కార్యములు సమకుర్చినచో మీ పేరున భోజన వసతి నిర్వహణ ఖర్చు 2000/- రూపాయలు సమకూర్చినచో మీ పేరున భోజన వసతి కల్పించబడును. మీరు చేయు సహాయము ఇంకా వతురూపేణ కూడా అందించవచు.
మీ పెద్దల జ్ఞాపకార్ధంగా కూడా ఆ రోజులలో భోజన సదుపాయం కల్పించవచ్చు.
ఈ విధంగా ఆవాసానికి ఒక మంచి పని చేయాలనే సహృదయముతో మీరు సహితం సహకరించే,సహకరిస్తున్న మీ దాతృత్వానికి స్వాగతిస్తున్నాం.

Master Anjaneyulu Scores 2nd Prize in the Vignan Mela

 సంభాగ్ స్థాయి విజ్ఞాన మేళ పోటిలలో ప్రతిభ కనబరచిన వాల్మీకి ఆవాస విద్యార్ధి ఆంజనేయులు.
విజ్ఞాన మేళలో ద్వితీయ స్థానంలో నిలిచాడు

Master Anjaneyulu Scores 2nd Prize in the Vignan Mela