Friday, April 26, 2013

శ్రీ వాల్మీకి ఆవాసంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు

సేవాభారతి అనుబంధ సంస్థ అయిన శ్రీ వాల్మీకి ఆవాసంలో  21-04-2013 ఆదివారం రోజున ఉదయం 9;30 నుండి 12;00గం; వరకు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి  వ్రతాలు  ఘనంగా నిర్వహించారు. గ్రామీణ,నిరుపేద,నిరక్షరాస్య కుటుంబాల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఈ ఆవాసంలో ప్రతి సంవత్సరం విద్యాసంవత్సరం చివరన విద్యార్థుల తల్లి,దండ్రులతో పాటు పట్టణ ప్రముఖులతో సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా 93జంటలు వ్రతంలో పాల్గొని తిర్ధప్రసాదాలను స్వీకరించారు. అనంతరం సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  పాల్గొన్న RSS విభాగ్ సంఘచాలక్ మల్లోజుల కిషన్ జీ    మాట్లాడుతూ సమాజంలో సామాజిక సమరసతను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో RSS జిల్లా సంఘచాలక్ Dr. భీమనాత్ని శంకర్, నగర సంఘచాలాక్ జిడిగె పురుషోత్తం,ఆవాస అధ్యక్షులు Dr. శైలేంధర్ రెడ్డి,ఉపాధ్యక్షులు భోగ వెంకటేశ్వర్లు,కార్యదర్శి మదన్ మోహన్ రావు, నిర్వాహకులు లక్ష్మా రెడ్డి,గౌడ సూర్యనారాయణ, Dr. ధనుంజయ్,మారుతీ రావు,అశోక్ రావు,బొమ్మెర సత్యనారాయణ,BJP రాష్ట్ర కార్యవర్గసభ్యులు ముదుగంటి రవీంధర్ రెడ్డి,ఆవాస ప్రముఖ్  మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.     

  1. DSCN4620.JPG ;- వ్రతంలో పాల్గొన్న dr. శైలెంధర్ రెడ్డి దంపతులు. 
  2. DSCN4628.JPG &4646 & 4693 ;- వ్రతంలో పాల్గొన్న దంపతులు. 
  3. kishanji ;-  కార్యక్రమంలో మాట్లాడుతున్న RSS విభాగ్ సంఘచాలక్ మల్లోజుల కిషన్ జీ  గారు.
Monday, April 15, 2013

Sri Valmiki Awasam : Group Pic
Sri Valmiki Awasam

Gopala Krishna IG Police Visits Valmiki Awasam with Family

శ్రీ వాల్మీకి ఆవాసమును సందర్శించిన గౌరవనీయులు IG గోపాలకృష్ణ గారు. వీరు ఆవాస విద్యార్థులతో ఎంతో ఆత్మీయభావంతో మాట్లాడటం జరిగింది . విద్యార్థులను బాగా చదవాలని, ఎన్నో విజయాలు సాధించాలని వారు కోరారు. 
Samuhika Satyannarayana Vrathamసామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవ ఆహ్వానము.
స్థలం; శ్రీ వాల్మీకి ఆవాసం,ధరూర్ క్యాంప్,జగిత్యాల.
శుభ సందర్భములలో సమాజము నందు సమరసత, ఐకమత్యము సాధించుటకు మన పెద్దలు మనకు అందించిన అనేక శ్రేష్ఠ భావాలలో పండుగలు, వ్రతాలు ముక్యమైనవి.
అందులో భాగముగా ప్రతి సంవత్సరము మాదిరిగానే మన ''శ్రీ వాల్మీకి ఆవాసం ఆవాసము'' లో
తేది 21-04-2013 ఆదివారం రోజున ఉదయం 9-00 గం"లకు నిర్వహించు
""సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము"" లో సకుటుంబ సపరివారముగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించగలరని మనవి.

** వ్రతములోపాల్గొనువారు హారతి పళ్ళెం, పూలు వెంట తీసుకురాగలరు.
మిగిలిన పూజాసామాగ్రి వ్రత స్థలములో ఇవ్వబడును.
** పూజలో పాల్గొన్న వారికి శ్రీ సత్యనారాయణస్వామి వారి ప్రతిమ ఇవ్వబడును.
** వ్రత శుల్కము 151-00 రూ"లు
** పూజ అనంతరము సామూహిక భోజనము ఉంటుంది.
**పురుషులు లుంగి లేదా ధోవతి ధరించి వ్రతములో పల్గోనవలెను.

సదా భరతమాత సేవలో
ప్రబంధకారిణి
శ్రీ వాల్మీకి ఆవాసం