Saturday, November 3, 2012

వాల్మీకి ఆవాసం విద్యార్థులకు దుప్పట్లు, పుస్తకాలు పంపిణీ

జగిత్యాల, మేజర్‌న్యూస్‌ ః జగిత్యాల పట్టణంలోని శ్రీ వాల్మీకి ఆవాసం విద్యార్థులకు శ్రీ అభయ గ్రూప్‌ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం దుప్పట్లు, నోటుపుస్తకాలు, పెన్నులు అందించడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ అభయ గ్రూప్‌ సంస్థ సిఎండి కుక్కట్ల శ్రీనివాస్‌ 34వ జన్మదినాన్ని జగిత్యాల శాఖ సిబ్బంది వాల్మీకి ఆవాసం విద్యార్థుల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్‌ తిరుపతి, సేల్స్‌ మేనేజర్‌ నవీన్‌, మార్కెటింగ్‌ సభ్యులు శ్రీధర్‌, విజయ్‌, లక్ష్మి, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు

Source: Surya newspaper