Thursday, April 20, 2017

శ్రీ వాల్మీకి ఆవాసము- సేవాభారతి రజతోత్సవం


శ్రీ వాల్మీకి ఆవాసము- సేవాభారతి రజతోత్సవం కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక గీతావిద్యాలయం మైదానంలో జరిగింది
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, కేంద్ర ఒప్పంద కార్మికుల సలహామండలి చైర్మెన్ సురభి భూమ్ రావు, ఆర్ఎస్ ఎస్ గౌడ జనార్దన్,  మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, తెలంగాణ ప్రాంత ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ పెడబల్లి దేవేంద్రజీ, ఆవాస కమిటీ అధ్యక్షుడు డా.ఎడ్మల శైలేందర్ రెడ్డి పాల్గొనగా, సభాధ్యక్షుడుగా ఆర్ ఎస్ ఎస్ జిల్లా సంఘ్ చాలక్ డా.భీమనాతిని శంకర్ వ్యవహరించారు..
ఇంకా ఈ కార్యక్రమంలో , ఉపాధ్యక్షుడు బోగ వెంకటేశ్వర్లు, కార్యదర్శి సందెల్లి మదన్ మోహన్ రావు, సహ కార్యదర్శి కాసిడి లక్ష్మరెడ్డి, కోశాధికారి తుమ్మనపల్లి సత్యనారాయణ తో పాటు సభ్యులు జిడిగె పురుషోత్తం, డా.గుండేటి ధనుంజయ, సుంకేటి లింబారెడ్డి, ఎన్నమనేని అశోక్ రావు, టివి సూర్యం, ఆవారి అంజన్ బాబు, బెజ్జంకి సంపూర్ణ చారి, కన్నవేని మల్లారెడ్డి, దువ్వాసి చంద్రమౌళి, వీరమల్ల మారుతిరావు, పుప్పాల సుఖేందర్ తదితరులు పాల్గొన్నారు.బిజెపి  జిల్లా అధ్యక్షుడు బాజోజి భాస్కర్, నాయకులు ముదుగంటి రవీందరెడ్డి, వూట్కూరి అశోక్ రెడ్డి, పూదరి అరుణ, ఎసిఎస్ రాజుు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆవాసం విద్యార్థులు ప్రదర్శించిన పలు వ్యాయామ విన్యాసాలు విశేషంగా అలరించాయి…
శ్రీ వాల్మీకి ఆవాసము- సేవాభారతి గురించి సేవాభారతి తెలంగాణ ప్రాంత ఉపాధ్యక్షుడు నాగు వివరిస్తూ….
సేవాభారతి సేవా సంస్థ ద్వారా సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా, సంస్కృతి పరంగా వెనుకబడిన మనతోటి బంథువుల సముధ్దరణ కోసం దేశవ్యాప్తంగా బాల సంస్కార కేంద్రాలు, ఉచిత బోధనా తరగతులు, ఏకోపాధ్యాయ పాఠశాలలు, బాల కార్మిక పాఠశాలలు, వైద్యకేంద్రాలు, ఆవాసాలు లాంటి ఒక లక్ష యాభై వేలకు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని వివరించారు.తెలంగాణ ప్రాంతంలో సేవా బస్తీ, గిరిజన, చెంచు, నిరాశ్రిత బాలల కోసం 15 ఆవాసములను సేవాభారతి నిర్వహిస్తుందని వెల్లడించారు. ఇందులో భాగంగానే జగిత్యాల శ్రీ వాల్మీకి ఆవాసము పేరిట గ్రామీణ నిరుపేద బస్తీ విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజన, వైద్య సదుపాయాలు కల్పించి, వారిలో సర్వాంగీణ వికాసం తీసుకురావడంతో పాటుగా , వారిని సంస్కారవంతులైన దేశభక్త పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం ప్రారంభమై, 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో నిర్వహిస్తున్న రజతోత్సవ సమావేశం సమాజంనుండి మరింత ప్రోత్సాహం అందగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ….నిరుపేద బస్తీ పిల్లలకు విద్యాబుధ్దులు నేర్పుతూ, క్రమశిక్షణతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దుతున్న సేవాభారతి కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం తలపెడుతున్న కార్యక్రమాలకు సేవాభారతిలాంటి సంస్థలు సహకార మందిస్తూ…గ్రామీణ, బస్తీ నిరుపేద విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, సంస్కారవంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలన్నారు.

Friday, March 17, 2017

Sevabharathi Telangana seeks your best wishes to all the 76 of our Student's appearing for SSC Board exams #BestWishes

Sevabharathi Telangana seeks
your best wishes
to all the 76 of our Student's

appearing for SSC Board exams

#BestWishes


Wednesday, March 15, 2017

శ్రీ వాల్మీకి ఆవాసం సేవాభారతి గ్రామీణ నిరుపేద విద్యార్థుల వసతి గృహంలో….హోళీ పండగను పురస్కరించుకుని, ఎస్ పి అనంతశర్మ దంపతులు సహపంక్తి భోజనం…


MARCH 12, 2017 • JAGTIAL NEWSPOLITICAL NEWS • VIEWS: 21
జగిత్యాల జిల్లా.. మార్చి 12:
తెలంగాణ రిపోర్టర్ : ( సిరిసిల్ల శ్రీనివాస్ )
శ్రీ వాల్మీకి ఆవాసం సేవాభారతి గ్రామీణ నిరుపేద విద్యార్థుల వసతి గృహంలో….హోళీ పండగను పురస్కరించుకుని, ఆదివారం వసతి గృహంలోని విద్యార్థులతో

కలిసి జగిత్యాల జిల్లా ఎస్ పి అనంతశర్మ దంపతులు సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో ముచ్చటించి, వారి వారి స్తితిగతులను, చదువుకుంటున్న తీరును, లక్ష్యములను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్ పి దంపతులతో సిఐ ప్రకాష్ వెంట ఉండగా, ఆవాసం నిర్వాహకులు డా.బి.శంకర్, మదన్ మోహన్ రావు, జిడిగె పురుషోత్తం, బోగ వెంకటేశ్వర్లు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Monday, August 22, 2016

Sevabharathi Telangana & Andhra Pradesh Chatrawas Alumni meet

Celebrating Silver Jubilee the Alumni of Sevabharathi Affection Homes. The family has grown to over 2,000 out of which 1389 are Alumni.

 Sevabharathi Telangana & Andhra Pradesh Chatrawas Alumni meet

Sevabharathi AP runs 7 Affection Homes in 4 districts catering to the most needy and destitute children

  1. Mathruchaya Chatravas(32 Children) Nutakki, Krishna Dist
  2. Bhakta Kannappa Gurukulam, (36 Tribal children) Gokavaram, Kurnool Dist
  3. Sanghamitra awasam, (35 Orphan Children) Nandyala, Kurnool Dist
  4. Annapoornamma vidyarthi vasathi griham, Kurnool, Kurnool Dist
  5. Nandyala Hanumantareddy Lakshmamma Vidyarthi Vasathi Griham,  Deepaguntla, Kurnool Dist
  6. P A Reddy Hostel(39 Children) Anantapuram
  7. Sri krishnadevaraya awasam, Dhramavaram, Anantapuram Dist 
  8.  Annapoornamma Vidyardhi uchita vasati Griham, Proddutur, Kadapa Dist 

Sevabharathi Telangana runs 18 Affection Homes

Sunday, August 14, 2016

Sri Valmiki Avasam Sevabharathi starts celebrations for its Silver Jubilee year


శ్రీ వాల్మీకి ఆవాసం ప్రారంభమై 24 సంవత్సరములు పూర్తి అయి 25 వ సంవత్సరం ప్రారంభ రోజు సందర్భంగా ఆవాస కమిటి సభ్యులు ఆవాసంలో సమావేశం కావడం జరిగింది ఈ కార్యక్రమం లో ఆర్ ఎస్ ఎస్ కరీనగర్ విభాగ ప్రచారక్ శ్రీ దేవేందర్ జి సేవాభారతి లక్ష్యం గుర్తుచేసారు.ఈ కార్యక్రమం లో ఆర్ ఎస్ ఎస్ విభాగ్ సహకర్యవాహ పాక సత్యనారాయణ గారు జిల్లా కర్యవాహ ఎన్నామనేని అశోక్ రావు గారు,ఆవాస ప్రధాన కార్యదర్శి నందేల్లి మదన్మోహన్ రావు గారు,ఆవాస సభ్యులు తదితరులు పాల్గొన్నారు.Wednesday, June 15, 2016

జగిత్యాల: శ్రీవాల్మీకి ఆవాసంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం


1  logo-జగిత్యాల పట్టణంలోని సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీవాల్మీకి ఆవాసంలో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ వాసం అధ్యక్ష, కార్యదర్శులు శైలేందర్‌రెడ్డి, నందెల్లి మదన్‌మోహన్‌లు తెలిపారు. శిశు నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్య, వసతి సదుపాయాలు ఉన్నాయన్నారు. రెండో తరగతిలో 3, నాల్గవ తరగతిలో 3, ఐదో తరగతిలో 3 ఖాళీలు ఉన్నాయని, వెనుకబడిన కుటుంబాల పిల్లల ఆసక్తిని బట్టి ప్రవేశాలుంటాయని, వివరాలకు 99892448893లో సంప్రదించాలని కోరారు.
Source http://prabhanews.com/2016/06/జగిత్యాల-శ్రీవాల్మీకి-ఆ/